రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, గవర్నర్‌ను కలుస్తాం: భూమన కరుణాకర్ రెడ్డి
- జగన్ ఘటనపై వైసీపీ నేతల కీలక భేటీ నిర్వహించాం
- స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలి
- కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని జగన్‌ని కోరాం
దాడి నేపథ్యంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని జగన్‌ను కోరామని, విశ్రాంతి అనంతరం పాదయాత్రలో పాల్గొనాలని జగన్‌ను కోరామని భూమన తెలిపారు. దాడి పట్ల, జగన్‌ను భౌతికంగా నిర్మూలించాలనే కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు.