కొత్త కథకి ఓకే చెప్పేసిన గోపీచంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త కథకి ఓకే చెప్పేసిన గోపీచంద్

  • గోపీచంద్ కి కథ వినిపించిన సంపత్ నంది 
  • డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు 
  • త్వరలోనే పూర్తి వివరాలతో ప్రకటన
ప్రస్తుతం గోపీచంద్ .. కుమార్ అనే ఒక నూతన దర్శకుడితో కలిసి ప్రేమతో ముడిపడిన ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా గోపీచంద్ లైన్లో పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడు.

గతంలో సంపత్ నంది - గోపీచంద్ కాంబినేషన్లో 'గౌతమ్ నంద' సినిమా వచ్చిందిగానీ, పెద్దగా ఆడలేదు. అయినా కొత్తగా వినిపించిన కథ నచ్చడంతో గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన సంపత్ నంది, డిసెంబర్లో రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ లోగా మిగతా నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఖరారు చేసుకుని ఎనౌన్స్ చేస్తారట. ఈ సినిమాతో తప్పకుండా గోపీచంద్ కి హిట్ ఇవ్వాలనే సంపత్ నంది కోరిక నెరవేరుతుందేమో చూడాలి.  
gopichand
sampath nandi

More Telugu News