'అమృత్‌సర్’ ఘటనను కావాలనే నాకు అంటగడుతున్నారు!: కన్నీళ్లు పెట్టుకున్న కార్యక్రమ నిర్వాహకుడు

అమృత్‌సర్‌లో రావణ దహన కార్యక్రమం కోసం అనుమతి తీసుకున్నానని.. వేడుక చూసేందుకు వచ్చిన వారిని పట్టాలపై నిలబడొద్దని కనీసం పది సార్లైనా హెచ్చరించానని రావణ దహన నిర్వాహకుడు, స్థానిక కౌన్సిలర్ కుమారుడు సౌరభ్ మదన్ మిత్తూ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమం సందర్భంగా అమృత్‌సర్‌లో ప్రజలపైనుంచి రైలు దూసుకుపోవడంతో 62 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. నాటి నుంచి సౌరభ్ పరారీలో ఉన్నాడు.

తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఓ వీడియోను రికార్డు చేసి, పోస్ట్ చేసిన సౌరభ్.. తాను ఏ తప్పూ చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని.. కొందరు కావాలని ఘటనను తనపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వీడియోలో వాపోయాడు. 
Go Back to Shorts
Amruthsar
Sourabh Madan Mittu
Video

More Telugu News