స్వయంగా వెళ్లి ‘తిత్లీ’ బాధితులను పరామర్శించి.. సాయమందించిన హీరో నిఖిల్
- 2500 కేజీల బియ్యం
- పోర్టబుల్ జనరేటర్ల పంపిణీ
- 500 దుప్పట్లు.. 3 వేల మందికి భోజనం
తాజాగా హీరో నిఖిల్ మరో ముందడుగు వేశాడు. స్వయంగా బాధిత ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజానీకాన్ని పరామర్శించడమే కాదు, 3 వేల మందికి భోజన సదుపాయం కల్పించాడు. అలాగే 2500 కేజీల బియ్యం, 500 దుప్పట్లు, విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్న వారికోసం పోర్టబుల్ జనరేటర్లు పంపిణీ చేశాడు. అలాగే అక్కడి ప్రజలతో కలిసి భోజనం చేశాడు. అది తనకు చాలా ఆనందాన్నిచ్చిందని నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.