మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
- లీటర్ పెట్రోల్ పై 18 పైసలు, డీజిల్ పై 29 పైసల పెంపు
- హైదరాబాద్ లో రూ.87కు చేరుకున్న పెట్రోల్
- అల్లాడిపోతున్న సామాన్య ప్రజలు
ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.12కు, డీజిల్ ధర రూ. 78.82కు చేరుకుంది. ఓవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, మరోవైపు డాలర్ తో రూపాయి బలహీనపడుతున్న నేపథ్యంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల పెట్రో ఉత్పత్తులపై రూ.2.5ను కేంద్రం తగ్గించినప్పటికీ రోజూ మారుతున్న ధరలతో వినియోగదారులకు ప్రయోజనం లేకుండా పోతోంది.