ప్రభాస్ .. పూజా హెగ్డే మూవీ టైటిల్ ఇదేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ .. పూజా హెగ్డే మూవీ టైటిల్ ఇదేనట!

  • రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ 
  • ఇటలీలో జరుగుతోన్న షూటింగ్ 
  • డిఫరెంట్ లుక్ తో ప్రభాస్
సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా షూటింగును కొంతవరకూ పూర్తి చేసిన ప్రభాస్, తన తదుపరి సినిమాపై దృష్టిపెట్టాడు. ఆయన నెక్స్ట్ మూవీ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఉందనే సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగు ఇటలీలో మొదలైంది. తొలి షెడ్యూల్ షూటింగులో ప్రభాస్ .. పూజా హెగ్డే పాల్గొంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ యూరప్ నేపథ్యంలో కొనసాగుతుంది గనుక, 'అమూర్' అనే టైటిల్ ను పెట్టే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. ఫ్రెంచ్ భాషలో 'అమూర్' అంటే 'ప్రేమ' అని అర్థం అట. ఇక తాజాగా 'జాన్' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. 'జాన్' అనే పేరు అందరికీ పరిచయమైనదే కావడం వలన అదే ఖరారు చేద్దామనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా చెబుతున్నారు. ప్రభాస్ కొత్త లుక్ తో ఈ సినిమాలో కనిపించనుండటం, ఆయన అభిమానులను ఖుషీ చేసే విషయం. 
prabhas
pooja hegde

More Telugu News