ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన ఆయిల్ సంస్థలు

  • పెట్రోల్ పై 23 పైసలు.. డీజిల్ పై 29 పైసల పెంపు
  • హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.19
  • లీటర్ డీజిల్ ధర రూ. 80.69  
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టినప్పటికీ... ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. ఇంధన ధరలను ఆయిల్ కంపెనీలు ఈరోజు కూడా పెంచేశాయి. లీటర్ పెట్రోల్ పై 23 పైసలు, లీటర్ డీజిల్ పై 29 పైసలు పెంచాయి.

 దీంతో, దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 82.26కు, డీజిల్ ధర రూ. 74.11కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 87.73కు, డీజిల్ ధర రూ. 77.68కు పెరిగింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.19కు చేరగా లీటర్ డీజిల్ ధర రూ. 80.69కు చేరుకుంది.  
Go Back to Shorts
petrol
diesel
price

More Telugu News