పెట్రోలు ధర ఈ రోజూ పైకే... నేటి ధరల వివరాలు!

  • కేంద్రం సుంకాలు తగ్గించినా దక్కని ప్రయోజనం
  • పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 29 పైసల వడ్డింపు
  • హైదరాబాద్ లో రూ. 86.63కు పెట్రోలు ధర
కేంద్ర ప్రభుత్వం 'పెట్రో' ఉత్పత్తులపై స్వల్పంగా సుంకాలను తగ్గించినా, ఆ ప్రయోజనాలను ప్రజలకు అందకుండా చేస్తున్నాయి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు. శనివారం నాడు లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 29 పైసల మేరకు ధరలను పెంచుతున్నట్టు ఐఓసీ పేర్కొంది. ఈ పెంపు తరువాత దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 81.68, డీజిల్ రూ. 73.24కు పెరిగాయి. ముంబైలో పెట్రోలు రూ. 87.15, డీజిల్ రూ. 76.75కు చేరుకోగా, హైదరాబాద్ లో పెట్రోలు రూ. 86.63కు, డీజిల్ రూ. 79.69కి చేరుకుంది.
Go Back to Shorts
Petrol
Diesel
Price Hike

More Telugu News