నా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి : రక్షణ మంత్రిపై చిదంబరం ట్వీట్ల వర్షం
- తమకేమీ దక్కలేదనే కాంగ్రెస్ అక్కసు అన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందన
- వరుస ట్వీట్లతో మూడు ప్రశ్నలు సంధించిన మాజీ మంత్రి
- ఎన్‌డీఏ ప్రభుత్వం సచ్చీలత నిరూపించుకోవాలని వ్యాఖ్య
వరుసగా మూడు ట్వీట్లు పెట్టి మూడు ప్రశ్నలను సంధించారు. 126 యుద్ధ విమానాల కొనుగోలుకు యూపీఏ ప్రభుత్వం దాదాపుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రధాని మోదీ ఎందుకు రద్దు చేశారని ఆయన తొలి ప్రశ్న వేశారు. కొత్త ఒప్పందంలో ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ (హాల్) పేరును ఎందుకు సూచించలేకపోయింది? అని ప్రశ్నించారు. సంప్రదింపులు జరపడం ద్వారా రాఫెల్ విమానాలను 9 శాతం తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు చెబుతున్న బీజేపీ ప్రభుత్వం ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం 126 జెట్లకు బదులు 36 విమానాలే ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి బీజేపీ ప్రభుత్వం తమ సచ్చీలత నిరూపించుకోవాలని కోరారు.