'ఆర్ ఎక్స్ 100' దర్శకుడి నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ ఎక్స్ 100' దర్శకుడి నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనే!

  • భారీ హిట్ కొట్టిన 'ఆర్ ఎక్స్ 100'
  • మల్టీ స్టారర్ ను పక్కన పెట్టేసిన అజయ్ భూపతి
  • భవ్యక్రియేషన్స్ బ్యానర్ పై మూవీ  
ఇటీవల కాలంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి .. ఎక్కువ లాభాలను సాధించిన సినిమాల్లో 'ఆర్ ఎక్స్ 100' ఒకటిగా కనిపిస్తుంది. కార్తికేయ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా దర్శకుడు అజయ్ భూపతి మరో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఆయన తదుపరి సినిమా నితిన్ తో వుండనుందనే వార్తలు వినిపించాయి. రామ్ .. దుల్కర్ సల్మాన్ హీరోలుగా మల్టీ స్టారర్ చేసే ఉద్దేశంతో ఉన్నాడనే టాక్ కూడా వినిపించింది. అయితే ప్రస్తుతానికి ఆయన ఈ మల్టీ స్టారర్ ను పక్కన పెట్టేశాడట. నితిన్ హీరోగా కథను లాక్ చేసుకుని, త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు.  
ajay bhupathi
nithin

More Telugu News