వరవరరావుకు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. మరో నాలుగు వారాలు గృహనిర్బంధంలోనే!
- భీమా-కొరేగావ్ కేసులో తీర్పు
- సిట్ ఏర్పాటు అవసరం లేదన్న న్యాయస్థానం
- దిగువ కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చని సూచన
గతేడాది మహారాష్ట్రలోని పుణెలో దళిత సంఘాలు ఎల్గర్ పరిషత్ సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం భీమా-కొరెగావ్ ప్రాంతంలో దళితులు, అగ్రవర్ణాల మధ్య జరిగిన గొడవల్లో తీవ్రమైన హింస చెలరేగింది. ఈ ఘటన నేపథ్యంలో ఐదుగురు హక్కుల కార్యకర్తలను పుణె పోలీసులు గత నెలలో అరెస్ట్ చేశారు. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అరెస్టును గృహనిర్బంధంగా మార్చింది. తమ తీర్పుపై పిటిషనర్లు దిగువ కోర్టులకు వెళ్లవచ్చని సూచించారు.