బ్రేకింగ్... శబరిమలకు మహిళలు వెళ్లవచ్చు: సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు
- మహిళల భక్తికి అయ్యప్పను దూరం చేయరాదు
- రుతుస్రావం సాకుగా చూపడం రాజ్యాంగ విరుద్ధం
- మిగతా అయ్యప్ప ఆలయాలకు లేని ఆంక్షలు శబరిమలలో ఎందుకన్న న్యాయస్థానం!
భారత రాజ్యాంగంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయన్న విషయాన్ని మరువరాదని, అయితే, భక్తుల మనోభావాల కోణం నుంచి కూడా కేసును పరిశీలించామని, అయితే, భగవంతుడు ఎక్కడున్నా ఒకటే అని చెప్పుకుంటున్న వేళ, మిగతా అయ్యప్ప దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై లేని ఆంక్షలు, శబరిమలలో ఉండరాదని పేర్కొంది.