తొలి పారితోషికాన్ని కేరళకి విరాళంగా ఇచ్చేసిన విక్రమ్ తనయుడు ధృవ్!
- తమిళంలోకి 'అర్జున్ రెడ్డి' రీమేక్
- కథానాయికగా మేఘ
- హిట్ ఖాయమంటోన్న విక్రమ్
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి హీరోగా అందుకున్న పారితోషికం మొత్తాన్ని చెక్కు రూపంలో, కేరళ వరద బాధితుల కోసం అక్కడి ముఖ్యమంత్రి సహాయ నిధికి 'ధృవ్' విరాళంగా అందజేశాడు. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 'ధృవ్' ను అభినందించారు. ఇక ఈ సినిమాలో ధృవ్ జోడీగా బెంగుళూర్ కి చెందిన మోడల్ మేఘ కథానాయికగా నటించింది. హీరోగా ఈ సినిమా ధృవ్ ను నిలబెడుతుందని విక్రమ్ భావిస్తున్నాడు. తెలుగులో మాదిరిగా తమిళంలోను ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.