'దేవదాస్' కథను చెప్పకనే చెప్పేసిన నాగార్జున!

  • 'దేవదాస్' ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా నాగార్జున
  • డాన్, డాక్టర్ల మధ్య స్నేహమే 'దేవదాస్'
  • ప్రేయసితో డాన్ ను కలిపే డాక్టర్ దేవ్
  • నానీతో కెమిస్ట్రీ కుదిరిందన్న నాగ్
నానీతో కలసి తాను నటించిన తాజా చిత్రం 'దేవదాస్' ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాగార్జున, హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్న వేళ 'దేవదాస్' స్టోరీ లైన్ ను చెప్పకనే చెప్పేశారు. తనకు డాన్ పాత్రలు కొత్తకాదని, అయితే, ఇందులోనే 'దేవ్' క్యారెక్టర్ వేరేగా ఉంటుందని చెప్పిన ఆయన, ఒక పేషంటుగా డాక్టర్ ను డాన్ కలుస్తాడని, వారిద్దరి మధ్య స్నేహం మొదలవుతుందని చెప్పారు.

ఆ డాన్ యువకుడిగా ఉన్న వయసు నుంచి న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న ఓ అమ్మాయిని ఆరాధిస్తుంటాడని, అయితే, ఆమెను ఒక్కసారి కూడా కలుసుకోడని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డాక్టర్, ఇద్దరినీ కలిపే కథే 'దేవదాస్' అన్నారు. డాన్ ను చూస్తే భయం కాబట్టి, ఇతరులు ఎవరూ మాట్లాడేందుకు కూడా సాహసం చేయరని, అందుకే అతనికి వైద్యం చేసిన డాక్టర్ దాస్, స్నేహితుడిగా మారతాడని, ఈ పాత్రలు రెండూ సినిమాలో చాలా హాస్యాన్ని పంచాయని అన్నారు. తనకు, నానీకి మధ్య మంచి కెమిస్త్రీ కుదిరిందని చెప్పారు.
Go Back to Shorts
Nagarjuna
Nani
Devadas
Movie
Tollywood

More Telugu News