కోలుకుని మాట్లాడుతున్న మాధవి... ఉచిత కాస్మొటిక్ సర్జరీ చేస్తామంటున్న వైద్యులు!
- తీవ్ర గాయాలపాలై కోలుకున్న మాధవి
- వెంటిలేటర్ తొలగింపు
- 24 గంటల్లో జనరల్ వార్డుకు మారుస్తామన్న వైద్యులు
మరో 24 గంటల్లో ఆమెను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మారుస్తామని, అవసరమైతే ఉచితంగా కాస్మొటిక్ సర్జరీ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె శరీరం చికిత్సకు పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు. కాగా, దాడిలో తల వెనుక భాగం నుంచి చెవి మీదుగా కంటి వరకూ కత్తి వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ముఖం పూర్వాకృతిని పొందేందుకు సర్జరీ చేస్తామని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.