మాధవి లేకుండా ఉండలేను.. నన్ను చంపితే బాగుండేది: సందీప్
- కూతురురు చూడాలని ఫోన్ చేస్తే వెళ్లాం
- నేను తప్పించుకోవడంతో.. మాధవిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు
- తక్కువ కులంలో పుట్టడమే నేను చేసిన పాపమా?
మనోహరాచారి తొలుత తనపై దాడి చేశాడని, తాను తప్పించుకోవడంతో మాధవిపై విచక్షణా రహితంగా దాడి చేశాడని సందీప్ తెలిపాడు. మాధవి లేకుండా ఉండలేనని... తనను చంపితే బాగుండేదని చెప్పాడు. తక్కువ కులంలో పుట్టడమే తాను చేసిన పాపమా? అంటూ కంటతడి పెట్టాడు. తాను ఎంతో ప్రేమించిన మాధవి లేకుండా ఉండలేనని చెప్పాడు.