సందీప్ డిశ్చార్జ్... మాధవి పరిస్థితి అత్యంత విషమం!
- నిన్న తండ్రి చేతిలో దాడికి గురైన మాధవి
- ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స
- చావుబతుకుల మధ్య పోరాడుతున్న మాధవి
మాధవి పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉందని, ఆమెకు ఎనిమిది గంటల పాటు సర్జరీ చేశామని, మరో సర్జరీ చేయాల్సి వుందని యశోదా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మాధవిని ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నామని, మెదడుకు దారితీసే పలు నరాలు తెగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని తెలిపాయి.