అల్లుడు పారిపోయినా.. కూతురును తెగనరికిన తండ్రి!
- హైదారాబాద్ గోకుల్ థియేటర్ వద్ద హత్యాయత్నం
- బ్యాగులో నుంచి కత్తి తీసి విచక్షణారహితంగా దాడి
- యువతి పరిస్థితి విషమం
తొలుత సందీప్ పై కత్తితో దాడి చేశాడు. అక్కడ నుంచి సందీప్ పారిపోవడంతో... కూతురును మరింత దారుణంగా నరికాడు. ఈ సందర్భంగా అతనిని అడ్డుకునే క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు కాలితో ఎగిరి తన్నాడు. అయితే, అతన్ని కూడా బెదిరించి, తన దాడిని కొనసాగించాడు. దాడిలో గాయపడ్డ సందీప్ ను స్థానిక నీలిమా ఆసుపత్రికి, మాధవిని యశోదా ఆసుపత్రికి స్థానికులు తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉంది.