కౌశల్ తో మూకుమ్మడి వాదన, బిగ్ బాస్ హౌస్ లో శారీరక హింస... టాస్క్ రద్దు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కౌశల్ తో మూకుమ్మడి వాదన, బిగ్ బాస్ హౌస్ లో శారీరక హింస... టాస్క్ రద్దు!

  • మరింత ఆసక్తికరంగా మారిన బిగ్ బాస్
  • కొట్టుకున్నంత పనిచేసిన తనీష్, కౌశల్
  • సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్
తుదిదశకు చేరిన టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పోటీలో గెలుస్తాడని అందరూ భావిస్తున్న కౌశల్ పై ఓ టాస్క్ లో మిగతా కంటెస్టెంట్స్ అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేయగా, అందరినీ హెచ్చరించిన బిగ్ బాస్, ఆ టాస్క్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. 'మీ ఇసుక జాగ్రత్త' పేరిట ఈ టాస్క్ 101వ రోజున జరుగగా, తనీష్, కౌశల్ లు శారీరక హింసకు పాల్పడ్డారు. డైరెక్ట్ ఫినాలేకు వెళ్లే అవకాశాన్ని బహుమతిగా ఇచ్చే టాస్క్ లో భాగంగా, ఇసుక కంటెయినర్ లోని ఇసుకను కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని మిగతావారు కింద పడేసే ప్రయత్నం చేస్తుండాలి.

ఈ టాస్క్ రెండు లెవల్స్ లో సాగుతుంది. తొలి దశలో కౌశల్ కంటెయినర్ ను పడేయటానికి సామ్రాట్, తనీష్ లు పెద్ద ప్రయత్నమే చేశారు. వీరిద్దరూ రోల్ రైడాకు మద్దతుగా కూడా నిలిచారు. ఈ క్రమంలో తనీష్, కౌశల్ ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. కంటెయినర్ రాడ్స్ విరగ్గొట్టడం, అద్దాలు పగులగొట్టడం వంటివి జరిగాయి. దీంతో రంగంలోకి దిగిన బిగ్ బాస్, శారీరక హింస జరుగుతోందని, అందరినీ బయటకు పంపిస్తానని కటువుగా హెచ్చరించాల్సి వచ్చింది. ఆపై టాస్క్ ను మధ్యలోనే రద్దు చేసి, ఈ పోటీలో రోల్ గెలిచాడని చెబుతూ, అతన్ని లెవల్ 2 పోటీకి పంపుతున్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.
biggboss
Tollywood
Tanish
Koushal

More Telugu News