నేడు కూడా పెరిగిన పెట్రోలు ధర... మరో ఆల్ టైమ్ రికార్డు!
- 15 పైసలు పెరిగిన పెట్రోలు ధర
- లీటరు డీజిల్ పై 6 పైసలు వడ్డన
- ముడిచమురు ధరలు పెరుగుతున్నందునే
- సుంకాలను తగ్గించాలని విపక్షాల డిమాండ్
ఇదే సమయంలో ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 89.44కు డీజిల్ ధర రూ. 78.33కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నందునే దేశంలో ధరలను పెంచక తప్పడం లేదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ధరల పెంపు తమ చేతుల్లో లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వెంటనే సుంకాలను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.