'పెట్రో' ధరల పెరుగుదలతో మోదీకి కష్టాలు తప్పవు!: రాందేవ్ బాబా
- పెరుగుతున్న పెట్రో ధరలు మోదీ కొంప ముంచుతాయి
- పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి
- గాడ్ ఫాదర్స్ లేకపోయినా.. నేను ఈ స్థాయికి ఎదిగా
మోదీ కొన్ని మంచి పనులు కూడా చేశారని... అయితే రాఫెల్ ఒప్పందంపై కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు తలెత్తిన విషయం తెలిసిందేనని రాందేవ్ బాబా చెప్పారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా లేనని, రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. తన వెనుక గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరని... అయినా తాను ఇంత స్థాయికి ఎదిగానని చెప్పారు. డబ్బు వెనక తాను ఏ రోజూ వెళ్లలేదని... డబ్బే తన వెనక వస్తుందని అన్నారు.