చంద్రబాబుపై పెట్టిన కేసు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ కేసుకన్నా చిన్నది: భూమన
- బాబ్లీ కేసు ఒక చెత్త కేసు
- శిక్ష కూడా పడని చిన్న కేసు
- తెలంగాణలో సానుభూతి ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారు
గత నాలుగేళ్లలో వైసీపీ నేతలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని భూమన మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి ఆంజనేయస్వామి తోక అంత పెద్దగా ఉందని ఎద్దేవా చేశారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అక్రమాలు, పుష్కరాల దుర్ఘటన, ఓటుకు నోటు ఘటనల్లో చంద్రబాబుపై ఒక్క కేసు కూడా లేదని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసమే ఓ చెత్త కేసును చంద్రబాబు తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలకు టీడీపీ నేతలు భజన చేస్తున్నారని విమర్శించారు.