కొండా దంపతులు నాకు ప్రత్యర్థులు కాదు: ఎర్రబెల్లి దయాకర్
- ఆమెకు టికెట్ రాకపోవడానికి, నాకు సంబంధం లేదు
- ఉనికి కోసమే నన్ను ప్రత్యర్థిగా భావిస్తున్నారు
- కాంగ్రెస్-టీడీపీ పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది
కొండా దంపతులు సహా తనకెవరూ ప్రత్యర్థులు లేరని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాను తెలంగాణ కోసం పోరాడాననీ, చంద్రబాబుతో గొడవపెట్టుకుని మరీ ప్రత్యేక తెలంగాణ కోసం టీడీపీ తరఫున లేఖ ఇప్పించానని వెల్లడించారు. ఏ ఎన్నికల్లో పోటీచేసినా ప్రజలు తనను ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న టీడీపీ అసలైన టీడీపీ కాదని దయాకర్ రావు అన్నారు