హైదరాబాద్‌లో దారుణం: పెళ్లి పేరుతో 9 ఏళ్లుగా వితంతువుపై అత్యాచారం.. సీఐ అరెస్ట్!
Add ap7am to your home Screen

హైదరాబాద్‌లో దారుణం: పెళ్లి పేరుతో 9 ఏళ్లుగా వితంతువుపై అత్యాచారం.. సీఐ అరెస్ట్!

Brutality in Hyderabad CI arrested for raping widow for 9 years on pretext of marriage
  • భర్త చనిపోయిన మహిళను మోసం చేసిన ఖైరతాబాద్ డీఐ బాలస్వామి
  • భార్య విషయం దాచి, ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్‌మెయిల్
  • బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు.. అరెస్ట్
  • ఇప్పటికే మరో మహిళ విషయంలోనూ బాలస్వామిపై ఆరోపణలు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తొమ్మిదేళ్లుగా ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఓ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ను అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్‌గా (డీఐ) పనిచేస్తున్న బాలస్వామిని సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. భర్త మరణించి ఒంటరిగా ఉన్న మహిళను మోసం చేసిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

నల్గొండ జిల్లాకు చెందిన మహిళకు 2008లో వివాహం కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. 2015లో ఆమె భర్త ప్రమాదానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో, 2016లో ఓ పని మీద చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమెకు అప్పటి అడ్మిన్ ఎస్సై బాలస్వామితో పరిచయం ఏర్పడింది. తాను అవివాహితుడినని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో, అనారోగ్యంతో ఉన్న తన భర్త ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఆమె కూడా అంగీకరించింది.

ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. కొంతకాలానికి బాలస్వామికి అప్పటికే పెళ్లయిన విషయం బాధితురాలికి తెలిసింది. దీనిపై నిలదీయగా.. భార్యతో గొడవలున్నాయని, విడాకులు తీసుకుని ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. బాధితురాలు అతడిని దూరం పెట్టడంతో, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి మళ్లీ ఆమెను లొంగదీసుకున్నాడు.

2021లో బాధితురాలి భర్త మరణించడంతో, బాలస్వామి ఆమెతో సహజీవనం కొనసాగించాడు. అయితే 2025 జనవరి నుంచి ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు, ఇన్నాళ్లుగా తనను శారీరకంగా వాడుకుని వదిలేశాడని ఆరోపిస్తూ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలస్వామిని అరెస్ట్ చేశారు.

కాగా, బాలస్వామి గతంలో భవానీనగర్ ఎస్‌హెచ్‌వోగా ఉన్నప్పుడు కూడా మరో మహిళతో వివాదంలో చిక్కుకున్నారని, అప్పుడు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో అతడిని ఖైరతాబాద్ డీఐగా బదిలీ చేశారని తెలుస్తోంది. తాజా ఘటనతో అతడిని సస్పెండ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
Advertisement
Balaswamy
Hyderabad CI arrest
Khairatabad Detective Inspector rape case
Saidabad police investigation
Hyderabad police sexual assault
Marriage promise cheating case

More Telugu News