కేసీఆర్ ను ప్రతి ఒక్కరికీ దగ్గర చేసిన భారీ తెరలు!

  • కిలోమీటర్ దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపించిన కేసీఆర్
  • మైదానంలో 50 భారీ తెరలను ఏర్పాటు చేసిన టీఆర్ఎస్
  • ప్రతి 200 మీటర్లకూ ఓ ఎల్ఈడీ స్క్రీన్
టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభలో దాదాపు కిలోమీటర్ దూరంలోని వారు కూడా తమ నేత కేసీఆర్ ను చాలా స్పష్టంగా చూసి, ఆయన మాట్లాడుతుంటే కేరింతలు కొట్టారు. సభా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ వీక్షించేందుకు 50 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. ఈ స్క్రీన్లలో తమను తాము చూసుకుంటూ, బహిరంగ సభా వేదికను చూస్తూ లక్షల మంది ప్రజలు మైమరచిపోయారు. ప్రతి 200 మీటర్లకూ ఓ ఎల్ఈడీ స్క్రీన్ ఉండేలా టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ ప్రసంగం మొదలైన తరువాత, మైదానంలో ఫ్లడ్ లైట్ల కన్నా, ఎల్ఈడీ తెరలే ఎక్కువ కాంతినిచ్చాయని పలువురు వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Kongarakalan
TRS
LED Screens

More Telugu News