షారుఖ్ కుమారుడితో జోడీ కట్టనున్న శ్రీదేవి రెండో కుమార్తె?
- ఒకే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వనున్న ఆర్యన్, ఖుషీ కపూర్
- సన్నాహకాల్లో కరణ్ జొహార్
- ఇప్పటికే జాన్వీని బాలీవుడ్ కు పరిచయం చేసిన కరణ్
ఈ నేపథ్యంలో వీరిద్దరిని ఒకే సినిమాతో వెండితెరకు పరిచయం చేయాలని దర్శకనిర్మాత కరణ్ జొహార్ భావిస్తున్నాడట. కథను రెడీ చేసే బాధ్యతను ఇప్పటికే కొందరు రచయితలకు అప్పజెప్పాడట. ఇప్పటికే శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 'ధడక్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను నిర్మించింది కూడా కరణ్ జొహారే. దీంతో, తన రెండో కుమార్తె బాధ్యతను కూడా అతనికే బోనీ కపూర్ అప్పగించారని సమాచారం.