పెళ్లయిన హీరోయిన్ల పట్ల నిర్మాతలు, దర్శకుల మైండ్ సెట్ మారాలి: సిమ్రాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లయిన హీరోయిన్ల పట్ల నిర్మాతలు, దర్శకుల మైండ్ సెట్ మారాలి: సిమ్రాన్

  • పెళ్లైతే అమ్మ పాత్రలే ఇస్తారా?
  • ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ లు పెళ్లయ్యాక కూడా అద్భుతమైన పాత్రలు పోషిస్తున్నారు
  • జ్యోతిక మంచి పాత్రలు చేస్తోంది
టాలీవుడ్, కోలీవుడ్ లను ఒక ఊపు ఊపిన నటి సిమ్రాన్. దక్షిణాదిలో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ సిమ్రానే. తెలుగులో టాప్ హీరోల సరసన పలు సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. పెళ్లి చేసుకున్నాక కొంత కాలం పాటు సినిమాలకు దూరమైన సిమ్రాన్... ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రజనీకాంత్ సరసన ఆమె నటిస్తోంది. దీనికి తోడు మరో రెండు, మూడు తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఎలాంటి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్న మీడియా నుంచి సిమ్రాన్ కు ఎదురైంది. దీనికి సమాధానంగా, 'కచ్చితంగా అమ్మ పాత్రలు కాదు' అంటూ సూటిగా చెప్పింది. పెళ్లయితే అమ్మ పాత్రలే ఇస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ లు పెళ్లైన తర్వాత కూడా అద్భుతమైన పాత్రలు చేస్తున్నారని తెలిపింది. జ్యోతిక కూడా పెళ్లయ్యాక మంచి పాత్రలు చేస్తోందని చెప్పింది. పెళ్లైన నటీమణుల విషయంలో నిర్మాతలు, దర్శకుల మైండ్ సెట్ మారాలని సూచించింది. 
simran
tollywood
kollywood

More Telugu News