బిగ్ బాస్... అతి చేసే దీప్తి ఇక బయటకే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్... అతి చేసే దీప్తి ఇక బయటకే!

  • 10 వారాలు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్
  • ఈ వారం నామినేషన్ లిస్టులో దీప్తి, పూజ, తనీష్, కౌశల్
  • దీప్తి బయటకు రావడం ఖాయమంటున్న ఫ్యాన్స్
తెలుగు బిగ్ బాస్ షో రెండో సీజన్ ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుని చివరి దశకు చేరింది. హౌస్ లో మరో పదిమంది మాత్రమే మిగలగా, నాలుగు వారాల్లో కార్యక్రమం ముగియనుంది. ఈ తరుణంలో నిన్న ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, దీప్తి, పూజ, తనీష్, కౌశల్ లు నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం హౌస్ నుంచి దీప్తి బయటకు రావడం ఖాయమని అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంట్లో అతి చేస్తుండే ఆమెపై పగ తీర్చుకునే అవకాశం ఫ్యాన్స్ కు లభించిందని కామెంట్లు వస్తున్నాయి.

మిగిలింది నాలుగు వారాలే కాబట్టి వారానికి ఇద్దరి చొప్పున ఎలిమినేట్ చేయవచ్చని, అదే జరిగితే దీప్తితో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెద్దగా లేని పూజ బయటకు వచ్చేస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. దీప్తి చేష్టలతో ఇప్పటికే వీక్షకులు విసిగిపోయారని కూడా బిగ్ బాస్ ను నిత్యమూ చూస్తూ, విశ్లేషిస్తున్న వారు చెబుతున్న పరిస్థితి. కౌశల్, తన ఆర్మీ సాయంతో ఎలాగూ సేవ్ అయిపోతాడని, తనీష్ పై నెగటివిటీ ఉన్నప్పటికీ, అభిమానుల అండతో ఈ వారం బయటపడిపోతాడని, ఎలిమినేషన్ కు నామినేట్ అయిన దీప్తి, పూజల మెడపై కత్తి ఉన్నట్టేనని అంటున్నారు.

కాగా, ఎప్పుడు ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చినా, టెన్షన్ తో హడావుడి చేస్తుండే దీప్తి, గత వారం కాస్తంత ప్రశాంతంగానే కనిపించింది. ఈ వారం డేంజర్ జోన్ లో ఉండటంతో, మళ్లీ తెగ టెన్షన్ పడుతోంది. తనను ఎవరు నామినేట్ చేసుంటారా అని నిన్న మధనపడింది. సినిమా నటిగా, టీవీ యాంకర్ గా రాణిస్తూ, హౌస్ లోకి ప్రవేశించిన దీప్తి ఈ వారం తరువాత హౌస్ లో ఉండటం దాదాపు అసాధ్యమే.
Tanish
Deepti
Pooja
Biggboss
Koushal

More Telugu News