ఇది నా గొప్పతనం కాదు: నటుడు జీవా
- బాలచందర్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు
- నిర్మాత రంజిత్ కుమార్ ప్రోత్సహించారు
- అలా నా సినీరంగ ప్రవేశం జరిగింది
ఏ ఆర్టిస్ట్ అయినా కానివ్వండి కెరియర్ పరంగా ఎదిగాడు అంటే దానికి మూలం దర్శక నిర్మాతలే. నేను ఎదగడానికి నేనే కారణమని ఏ ఆర్టిస్ట్ అయినా అనుకుంటే అందుకు నేను ఒప్పుకోను. నేను ఈ స్థాయికి రావడం నా ఘనత కాదు. నన్ను మొదటిసారిగా కె. బాలచందర్ గారు తెరకి పరిచయం చేశారు. ఆయన ఎంపికను సమర్థించి నిర్మాత రంజిత్ కుమార్ గారు నన్ను ప్రోత్సహించారు. అలా నేను సినిమాల్లోకి రావడం .. విభిన్నమైన పాత్రల కారణంగా మంచి పేరు రావడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.