'ఎవరీ ట్వీట్ చేసింది?' తన మేనేజర్ ను గద్దించిన సమంత!
- తనను పిలవకుండా మేనేజర్ మహేంద్ర పార్టీ
- అడవి శేషు, రాహుల్ కోసం వెయిట్ చేస్తున్నానన్న మహేంద్ర
- ట్వీట్ ఎవరు చేశారో చెప్పాలన్న సమంత
అందుకు సంబంధించిన ఫొటోలను మహేంద్ర తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. ఈ చిత్రాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని, అడవి శేషు, రాహుల్ రవీంద్రన్ కోసం వెయిట్ చేస్తున్నానని మహేంద్ర ట్వీట్ చేయగా, సమంత వాటిని చూసింది. "ఈ ట్వీట్ ను ఎవరు టైప్ చేశారు.. ముందు అది చెప్పు" అని సమంత వెంటనే స్పందించింది. ఈ పార్టీకి తనను ఎందుకు పిలవలేదన్న చిరుకోపాన్ని సమంత ఈ ట్వీట్ ద్వారా చూపగా, ఇదిప్పుడు వైరల్ అవుతోంది.