నాగ్ చేతుల మీదుగా 'చి ల సౌ' ట్రైలర్ రిలీజ్
- తెరపైకి మరో ప్రేమకథా చిత్రం
- సుశాంత్ జోడీగా రుహాని శర్మ
- వచ్చేనెల 3వ తేదీన విడుదల
పెళ్లి చేసుకోమంటూ హీరోని ఒకవైపున తల్లి .. మరో వైపున స్నేహితులు ఒత్తిడి చేస్తుంటారు. దాంతో తనకి పెళ్లి ఇష్టం లేదంటూనే అతను ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తరువాత వాళ్లిద్దరి మధ్య చోటు చేసుకునే సరదాలు .. కలహాలతో కూడిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ కొనసాగింది. ఈ తరం కుర్రకారుకి ఎక్కే కంటెంట్ తోనే ఈ సినిమా రూపొందిందనే విషయం అర్థమవుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా వుండటం వలన, ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ప్రశాంత్ విహారి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అనిపిస్తోంది.