'బిగ్ బాస్ 2'కి నాని హోస్టింగ్ గురించి యాంకర్ శ్యామల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్ 2'కి నాని హోస్టింగ్ గురించి యాంకర్ శ్యామల

  • ఎన్టీఆర్ .. నానీలను పోల్చలేం 
  • ఎవరి స్టైల్ వారిది 
  • నాని యాంకరింగ్ కూడా నాచురల్ గానే వుంది  
బుల్లితెరపై యాంకర్ గా మంచి మార్కులు కొట్టేసిన శ్యామల, అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తోంది. 'బిగ్ బాస్ హౌస్'లోకి ఎంటరైన ఆమె, ఇటీవలే ఎలిమినేట్ చేయబడింది. బిగ్ బాస్ హౌస్ లోని తన అనుభవాలను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావించింది. ఈ షోకి నాని హోస్టింగ్ ఎలా ఉందనే ప్రశ్న ఆమెకి ఎదురైంది.

అప్పుడామె స్పందిస్తూ .. "ఎన్టీఆర్ .. నానీలను ఒకరితో ఒకరిని పోల్చలేం .. ఎవరి స్టైల్ వారిది. నానికి నాచురల్ స్టార్ అనే పేరుంది .. ఆయన యాంకరింగ్ కూడా చాలా నాచురల్ గానే వుంది. సినిమాల్లో ఆయనని మనం పక్కింటి అబ్బాయిలా చూస్తూ వచ్చాం. అందువలన ఆయన ఈ షోలో కోటు వేసుకుంటే కొత్తగా అనిపిస్తూ ఉండొచ్చు. ఆయనను కోటులో చూసినప్పుడు .. పక్కింటబ్బాయిలానే బాగున్నాడని అనిపించింది .. ఆ తరువాత అలవాటు పడిపోయాను. లుక్స్ విషయంలో తప్ప ఆయనలో మరెలాంటి మార్పు లేదనేది నా ఫీలింగ్. ఆయనకి కోపం వస్తే తిడుతున్నారు .. నచ్చితే మెచ్చుకుంటున్నారు" అంటూ చెప్పుకొచ్చింది.  
shyamala

More Telugu News