'అంకుశం'లో రామిరెడ్డి చేయనన్నాడు: దర్శకుడు కోడి రామకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అంకుశం'లో రామిరెడ్డి చేయనన్నాడు: దర్శకుడు కోడి రామకృష్ణ

  • రామిరెడ్డిని అక్కడ చూశాను 
  • ఎమ్మెస్ రెడ్డి ఫ్రెండ్ కొడుకే ఆయన 
  • 'అంకుశం'లో విలన్ గా చేయమని అడిగాను   
హీరోగా రాజశేఖర్ కెరియర్లో .. దర్శకుడిగా కోడి రామకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా 'అంకుశం' మూవీ కనిపిస్తుంది. అలాంటి ఈ సినిమా విశేషాలను గురించి, తాజా ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ ప్రస్తావించారు . "నేను 'అంకుశం' సినిమాను మొదలుపెట్టాలనుకున్నప్పుడే విలన్ పాత్రధారి ఫలానా విధంగా వుంటే బాగుంటుందనే ఒక ఆలోచన వుంది.

నిర్మాత ఎమ్మెస్ రెడ్డితో కలిసి ఆయన స్నేహితుడి ఇంటికెళ్లినప్పుడు, ఓ యువకుడు అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. 'అంకుశం'లో విలన్ గా అతనైతే బాగుంటాడని భావించి ఎమ్మెస్ రెడ్డిగారికి చెప్పాను. ఆ యువకుడు తన స్నేహితుడి కొడుకని అప్పుడు చెప్పాడు ఆయన. దాంతో రామిరెడ్డిని పిలిచి 'అంకుశం'లో విలన్ గా చేయమని అడిగాము .. కానీ ఆయన పెద్దగా ఆసక్తిని చూపించలేదు. మొత్తానికి ఆయనను ఒప్పించి .. చార్మినార్ నుంచి కొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకొచ్చే సీన్ ను ఫస్టు షూట్ చేశాం. దాంతో ఆయన నేను చేయను గాక చేయనంటూ మళ్లీ పేచీ పెడితే .. నచ్చజెప్పి చేయించాం. ఆ పాత్ర ఆయనకి ఎంత పేరు తీసుకొచ్చిందో తెలిసిందే" అని చెప్పుకొచ్చారు.    
rajasekhar
ramireddi

More Telugu News