శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ కోసం దర్శకుల వెయిటింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ కోసం దర్శకుల వెయిటింగ్

  • విభిన్న కథా చిత్రాల హీరోగా శర్వానంద్ 
  • సెట్స్ పై వున్న రెండు సినిమాలు 
  • ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడంపైనే దృష్టి
కథాకథనాల్లోను .. పాత్రను తీర్చిదిద్దే విషయంలోను కొత్తదనం వుంటేనే శర్వానంద్ ఓకే చెబుతాడు. అలాంటి కథల కోసం ఆయన ఎంత కాలమైనా ఆగుతాడుగానీ .. ఒక పట్టాన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడని అంటారు. ప్రస్తుతం ఆయన హనురాఘవపూడితో ఒక సినిమా .. సుధీర్ వర్మతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఆయనతో తమ సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు పోటీపడుతున్నారు.

ఇప్పటికే ఇంద్రగంటి మోహనకృష్ణ .. శ్రీకాంత్ అడ్డాల .. శ్రీనివాసరాజు ఆయనకి కథలు వినిపించారట. మరికొంతమంది దర్శకులు కథలు వినిపించే ప్రయత్నాల్లో వున్నారు.  కథలైతే వింటున్నాడట గానీ .. ఇంతవరకూ ఆయన ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ప్రస్తుతం చేస్తోన్న రెండు సినిమాలు పూర్తయిన తరువాతనే, వేరే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. ముందుగా ఆయన ఎవరికి ఓకే చెబుతాడో చూడాలి మరి.    

sharwanand

More Telugu News