సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • లావణ్యకు బాలీవుడ్ నుంచి ఆఫర్
  • సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ 
  • లేడీ డైరెక్టర్ చిత్రానికి సూర్య గ్రీన్ సిగ్నల్  
*  ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఒక సినిమా, నిఖిల్ తో మరో సినిమా చేస్తున్న కథానాయిక లావణ్య త్రిపాఠి త్వరలో బాలీవుడ్ రంగ ప్రవేశం చేయడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందని, త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తుందని తెలుస్తోంది.
*  సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్టు తాజా సమాచారం. గతంలో వీరిద్దరూ కలసి చేసిన 'గౌతమ్ నందా' చిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయిన సంగతి విదితమే.
*  ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరో సినిమా, కేవీ ఆనంద్  దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ బిజీగా వున్న తమిళ హీరో సూర్య తాజాగా లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో నటించడానికి కూడా ఓకే చెప్పాడు. సుధ చెప్పిన పిరియాడిక్ స్టోరీ బాగా నచ్చడం వల్లే డేట్స్ సర్దుబాటు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 
Lavanya
Gopichand
Surya

More Telugu News