నా ఫోన్ నెంబర్ ఇవ్వను .. అభిమానితో నివేదా థామస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా ఫోన్ నెంబర్ ఇవ్వను .. అభిమానితో నివేదా థామస్!

  • చెన్నై నాకు ఇల్లులాంటిది 
  • హైదరాబాద్ అంటే ఇష్టం 
  • థియేటర్లలోనే సినిమాలు చూస్తాను
తెలుగు తెరకి పరిచయమైన తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుని, నటన పరంగా నివేదా థామస్ మంచి మార్కులను కొట్టేసింది. అలాంటి నివేదా థామస్ చదువును పూర్తి చేయడం కోసం కొంతకాలంగా సినిమాలను దూరం పెట్టింది. చదువును పూర్తిచేసేసిన ఆమె .. తాజాగా కల్యాణ్ రామ్ జోడీగా ఒక సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆమె కాసేపు మాట్లాడింది.

అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె చాలా ఓపికగా సమాధానాలిచ్చింది. "చెన్నై నాకు ఇల్లులాంటిది .. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. విభిన్నమైన కథా చిత్రాల్లో నటించడం .. ప్రేక్షకులను మెప్పించడం నాకు ఇష్టం. నా సినిమాలన్నింటినీ నేను థియేటర్లోనే చూస్తాను .. ప్రేక్షకులతో కలిసి చూడటానికే ఎక్కువగా ఇష్టపడతాను .. అందులోనే అసలైన సరదా వుంది కూడా. చిత్రపరిశ్రమలో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ అంటే 'నాని' పేరు చెబుతాను" అని అంది. 'మీ ఫోన్ నంబర్ ఇస్తారా?' అని ఓ అభిమాని అడగ్గా 'ఇవ్వను' అంటూ ఆమె నిర్మొహమాటంగా చెప్పింది.
Niveda Thomas

More Telugu News