భారీ రేటుకు 'ముద్ర' శాటిలైట్ రైట్స్
- నిఖిల్ హీరోగా రూపొందుతోన్న 'ముద్ర'
- కథానాయికగా లావణ్య త్రిపాఠి
- త్వరలో టీజర్ విడుదల
ఇంతవరకూ 50 శాతం చిత్రీకరణను పూర్తిచేశారు. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిఖిల్ .. అర్జున్ అనే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. అందువలన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి మంచి ధరే పలికింది. తెలుగు .. హిందీ శాటిలైట్ రైట్స్ ను అయిదున్నర కోట్లకు అమ్మినట్టుగా సమాచారం. 'ఠాగూర్' మధు నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నారు.