‘బిగ్‌బాస్’ నుంచి శ్యామల ఎలిమినేట్ అయిన విధంబెట్టిదనిన..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘బిగ్‌బాస్’ నుంచి శ్యామల ఎలిమినేట్ అయిన విధంబెట్టిదనిన..!

  • ఎలిమినేషన్ నుంచి బయటపడిన దీప్తి, నందిని
  • ఓటింగ్ పవర్‌ను ఉపయోగించిన కౌశల్, తేజశ్వి
  • దీప్తిపై బిగ్ బాంగ్ ప్రయోగించిన శ్యామల
తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ వారం పలు అనూహ్య పరిణామాల మధ్య యాంకర్ శ్యామల బిగ్ బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయింది. ఎవరూ ఊహించని రీతిలో శ్యామల ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్‌లో శ్యామల, దీప్తి, నందిని, కౌశల్, బాబు గోగినేని, గణేశ్, తేజశ్వి ఉండగా, గణేశ్, బాబు గోగినేని, తేజశ్వి, కౌశల్ ప్రొటెక్టెడ్ జోన్‌లోకి వెళ్లారు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఎలిమినేషన్‌లో ఉన్న మిగతా ముగ్గురు నందిని, దీప్తి, శ్యామలలో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ ఈసారి వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. చెరుకురసం టాస్క్‌లో బాగా ఆడినందుకు కౌశల్, తేజశ్వికి ఎక్కువ మార్కులు రావడంతో వారిద్దరికీ ప్రత్యేక అధికారం లభించింది. దీంతో ఎలిమినేషన్‌లో ఉన్న వారిలో వారిద్దరూ ఓటు వేయడం ద్వారా ఇద్దరిని రక్షించే అవకాశాన్ని బిగ్ బాస్ వారికి కల్పించాడు.

 దీంతో కౌశల్ తన ఓటును నందినికి వేసి ఎలిమినేషన్ నుంచి బయటపడేయగా, తేజశ్వి తన ఓటును దీప్తికి వేసింది. దీంతో శ్యామల ఎలిమినేషన్ ఖరారైంది. అనంతరం కౌశల్ మాట్లాడుతూ.. తన 11 నెలల బాబును వదిలిపెట్టి హౌస్‌ లోకి వచ్చి బాధపడుతున్న కారణంగానే ఆమెకు ఓటు వేయలేదని తెలిపాడు. దీనివల్ల ఆమె తన బిడ్డను కలుసుకునే అవకాశం వస్తుందన్నదే తన ఉద్దేశమని చెప్పాడు. బి‌గ్ బాస్‌లో తన ప్రయాణాన్ని ముగించిన శ్యామల వెళ్తూవెళ్తూ బిగ్ బాంగ్‌ను దీప్తిపై ప్రయోగించింది. దీంతో దీప్తి ఈ వారం హౌస్‌లోని అందరి దుస్తులు ఉతకాల్సి ఉంటుంది.
BigBoss2
Anchor
Shyamala
Hyderabad

More Telugu News