పైరసీ విషయంలో 'భాగమతి' తరువాత స్థానంలోనే 'రంగస్థలం'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పైరసీ విషయంలో 'భాగమతి' తరువాత స్థానంలోనే 'రంగస్థలం'!

  • అత్యధిక మంది పైరసీలో చూసిన సినిమాలు 
  • మొదటి పది చిత్రాల్లో ముందున్న 'భాగమతి' 
  • చివరిస్థానంలో 'టచ్ చేసి చూడు'    
ఈ ఏడాది విడుదలైన సినిమాలలో 'రంగస్థలం' సంచలన విజయాన్ని సాధించి కొత్త రికార్డును సృష్టించింది. భారీ వసూళ్లతో మిగతా సినిమాలకంటే ముందు నిలిచింది. అయితే ఒక విషయంలో మాత్రం 'రంగస్థలం' కంటే ముందు 'భాగమతి' సినిమా నిలిచింది .. ఆ విషయమే పైరసీ. తెలుగులో ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో పైరసీ బారినపడిన సినిమాల జాబితాను ఒక జర్మనీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఆ సినిమాలలో తొలి పదిస్థానాలలో 'భాగమతి' మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను 1.9 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇక 'రంగస్థలం'  సినిమాను 1.6 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకుని పైరసీలో చూశారు. అలా పైరసీ విషయంలో 'భాగమతి' తొలిస్థానంలో నిలవగా, రెండవ స్థానంలో 'రంగస్థలం' నిలబడింది. మిగతా స్థానాల్లో వరుసగా 'భరత్ అనే నేను' .. .. 'మహానటి' .. 'నా పేరు సూర్య' .. 'తొలిప్రేమ' .. 'ఛలో' .. 'అజ్ఞాతవాసి' .. 'జయసింహా' .. 'టచ్ చేసి చూడు' సినిమాలు నిలిచాయి
anushka

More Telugu News