ఇప్పట్లో విలన్ గా నటించే ఉద్దేశం లేదు: గోపీచంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పట్లో విలన్ గా నటించే ఉద్దేశం లేదు: గోపీచంద్

  • గోపీచంద్ హీరోగా రూపొందిన 'పంతం' 
  • ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు 
  • మరో రెండు సినిమాలు లైన్లో  
మాస్ యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి పేరుంది. ఆయన కథానాయకుడిగా నటించిన 'పంతం' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే .. ఇకపై విలన్ గా చేయడానికి కూడా గోపీచంద్ సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. విలన్ పాత్రతోనే గోపీచంద్ తన కెరియర్ ను మొదలుపెట్టాడు. ఆ తరువాత హీరోగా మారిన ఆయన అప్పటి నుంచి యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

అయితే ఇటీవల కాలంలో ఆయనకి సరైన హిట్ పడలేదు. దాంతో ఒక వైపున హీరోగా చేస్తూనే మరో వైపున విలన్ గాను చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడనే ప్రచారం మొదలైంది. తాజాగా ఈ ప్రచారంపై గోపీచంద్ స్పందిస్తూ .. " నేను విలన్ గా కూడా చేయనున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదు .. ఇప్పట్లో అలాంటి ఆలోచన కూడా లేదు. నూతన దర్శకుడు కుమార్ తోను .. సంపత్ నందితోను చేయాల్సిన ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను" అని చెప్పుకొచ్చాడు.  
gopichand

More Telugu News