ashok babu: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. అడ్ హాక్ కమిటీని రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ పై ఈ నెల 13న వాదనలు విన్న సింగిల్ బెంచ్ స్టే విధించింది. పిటిషన్ స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ అడ్ హాక్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ గౌడ్ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్... స్టేను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. జనరల్ బాడీ మీటింగ్ ను ఎందుకు నిర్వహించలేదని, సంవత్సరాంతర రిటర్న్స్ ను ఇంకా ఎందుకు సమర్పించలేదని అశోక్ బాబును డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ డీసీవోను ఆదేశించింది. హౌసింగ్ సొసైటీకి మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
ashok babu
ap ngo
High Court

More Telugu News