raj kumar: స్టార్ హీరోకి జోడీగా ఛాన్స్ కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్
- తెలుగు సినిమాలతో బిజీగా అనుపమ
- స్టార్ హీరోల సరసన ఛాన్స్ కోసం వెయిటింగ్
- కన్నడలోను బిజీ అయ్యే అవకాశం
మలయాళం నుంచి తెలుగులోకి అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ .. ఇక్కడి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. వరుస హిట్లు పడుతుండటంతో అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కోసమే అమ్మడు ఎదురుచూస్తోంది. అయితే ఆ అవకాశం తెలుగు నుంచి కాకుండా కన్నడ నుంచి వచ్చింది.
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా దర్శకుడు పవన్ వడయార్ 'నట సార్వభౌమ' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక కోసం అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నారు. కథా కథనాలు .. పాత్రలోని కొత్తదనం నచ్చడం వల్లనే అనుపమ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అదృష్టం బాగుండి ఈ సినిమా అక్కడ విజయాన్ని సాధిస్తే, కన్నడలోను అనుపమ బిజీ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో 'తేజ్ ఐ లవ్ యూ'తో ఈ నెల 6వ తేదీన ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది.