మహారాష్ట్రలో ప్లాస్టిక్ నిషేధంపై నటి పూనమ్ పాండే సెటైర్లు!
- పూనమ్ పాండేను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- ప్లాస్టిక్‌కు, రబ్బర్‌కు తేడా తెలియదా? అంటూ ఎద్దేవా
- ఆమె చదువుకున్నది నగ్నత్వ ప్రదర్శన కోసమేనన్న యూజర్లు
ఆమె ట్వీట్లపై నెటిజన్లు కూడా అంతే సెటైరికల్‌గా ట్వీట్ చేస్తూ పూనమ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కండోముల గురించి ఆమె అడిగిన ప్రశ్నకు ఓ ట్విట్టర్ యూజర్ బదులిస్తూ.. తొలుత ప్లాస్టిక్‌కు, రబ్బరుకు తేడా తెలుసుకుంటే మంచిదని సూచించాడు. నగ్నత్వ ప్రదర్శన కోసమే ఆమె చదువుకున్నట్టు అనిపిస్తోందని చురక అంటించాడు. మరో యూజర్ ఆమె ఫొటోలను పోస్టు చేసి దుస్తులను కూడా బ్యాన్ చేశారా? అని ప్రశ్నించాడు. మరో యూజర్ అయితే, ‘‘నీ దగ్గరే బోల్డంత ప్లాస్టిక్ ఉంది. జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. మొత్తానికి ఓ చిన్న ట్వీట్ చేసిన పూనమ్ పాండేను నెటిజన్లు ఇలా ఆటాడుకుంటున్నారు.