కీర్తి సురేశ్, రాధికా ఆప్టే 'అక్క'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?
Advertisement

కీర్తి సురేశ్, రాధికా ఆప్టే 'అక్క'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?

Keerthy Suresh and Radhika Apte Akka streaming date fixed
  • కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో 'అక్క' వెబ్ సిరీస్
  • అక్టోబర్ 30న స్ట్రీమింగ్ కానుందంటూ మీడియాలో వార్తలు
  • 1980ల నాటి స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియడ్ థ్రిల్లర్‌గా రూపకల్పన
  • వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం
  • విడుదల తేదీపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'అక్క' వెబ్ సిరీస్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియడ్ థ్రిల్లర్ విడుదల తేదీకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సింగపూర్‌కు చెందిన ఒక మీడియా సంస్థ కథనం ప్రకారం, ఈ సిరీస్ 2026 అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఈ అంశంపై నెట్‌ఫ్లిక్స్ గానీ, నిర్మాణ సంస్థ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ సిరీస్ కథాంశం 1980ల నాటి నేపథ్యంలో సాగుతుంది. దక్షిణ భారతదేశంలోని 'పెర్నూరు' అనే కల్పిత పట్టణంలో ఈ కథను అల్లారు. ఈ పట్టణం పూర్తిగా మహిళల ఆధిపత్యంలో ఉండటం గమనార్హం. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలన్నీ వారి నియంత్రణలోనే ఉంటాయి. ఇక్కడ 'అక్కలు'గా పిలవబడే ఒక శక్తివంతమైన మహిళా బృందం, పట్టణంలోని అక్రమ బంగారం రవాణా వ్యాపారాన్ని శాసిస్తుంటుంది. తమ సంపదను, గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా సైన్యంతో, భయం, విధేయత పునాదులపై వారు తమ సామ్రాజ్యాన్ని ఏలుతుంటారు.

ఇటువంటి పరిస్థితుల్లో, వ్యక్తిగత పగతో ఒక అపరిచితుడు ఆ పట్టణంలోకి అడుగుపెడతాడు. అక్కల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను, వైరాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని వారి ఆధిపత్యాన్ని సవాలు చేస్తాడు. దీంతో నమ్మకద్రోహాలు, హింస చోటుచేసుకుని, అధికారం కోసం భీకరమైన పోరాటం మొదలవుతుంది. ఈ శక్తివంతమైన పత్రాల్లో కీర్తి సురేశ్, రాధికా ఆప్టే నటిస్తుండగా, సీనియర్ నటి తన్వి అజ్మీ ఒక కీలక పాత్రలో కనిపిస్తారు.

గతేడాది (2025) విడుదలైన ఈ సిరీస్ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ధర్మరాజ్ శెట్టి ఈ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Keerthy Suresh
Radhika Apte
Akka Web Series
Netflix India
Yash Raj Films
Period Thriller

More Telugu News