'విజేత' ఆడియో వేడుకకి వేదిక ఖరారు
- కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
- నిర్మాతగా సాయి కొర్రపాటి
- దర్శకుడిగా రాకేశ్ శశి
రేపు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉండగా, ఆయనతో పాటు చరణ్ .. అల్లు అర్జున్ కూడా రానున్నట్టు చెబుతున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన 'కో .. కొక్కరొకో .. ' అనే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట .. ఈ సినిమాపై అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ జోడీగా మాళవిక నాయర్ నటించిన సంగతి తెలిసిందే.