bigg boss: ఈరోజు 'ఇంకొంచెం మసాలా'.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సినీనటులు శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌

షార్ట్స్‌లో చూడండి
శ్రీనివాసరెడ్డి హీరోగా, సిద్ది ఇద్నాని హీరోయిన్‌గా జేబీ మురళీ కృష్ణ దర్శకత్వంలో ‘జంబ లకిడి పంబ’ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ కూడా నటించాడు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో భాగంగా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-2 హౌస్‌కి శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌ ప్రవేశించారు.      

వారు పార్టిసిపెంట్స్‌తో సరదాగా మాట్లాడారు. ‘జంబ లకిడి పంబ’ సినిమాలోని తాను నటించిన పాత్రలా శ్రీనివాసరెడ్డి అమ్మాయిలా డైలాగులు చెప్పాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్‌ మా విడుదల చేసింది. ఈరోజు రాత్రి 9.30 గంటలకు వారి ఎంట్రీని చూడొచ్చని తెలిపింది. ఇటీవల విడుదలైన ఆ సినిమా పోస్టర్లు, ట్రైలర్‌లలో అమ్మాయిల దుస్తుల్లో హీరో.. అబ్బాయిలా హీరోయిన్‌.. కనపడిన విషయం తెలిసిందే. 
Go Back to Shorts
bigg boss
vennela kishore

More Telugu News