ప్రజల్లో నిజాయతీ ఎక్కడుంది?: అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు
- పన్నులు సక్రమంగా కట్టకపోవడం వల్లే 'పెట్రో' మంట
- పెట్రోలు, డీజెల్ పై సుంకాలు తగ్గించేది లేదు
- చిదంబరం చెప్పినట్టు చేస్తే మిగిలేది చిప్పే
మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చెప్పే మాటలు వింటే చివరికి చేతిలో చిప్ప మిగులుతుందని విమర్శించిన ఆయన, ఇంధన ధరలను లీటరుకు రూ. 25కు తగ్గిస్తే, భారతావని అప్పుల్లో కూరుకుపోతుందని అన్నారు. కాంగ్రెస్ వారు తాము చేసిన తప్పులను ఇప్పుడు ఎన్డీయేతో కూడా చేయించాలని చూస్తున్నారని ఆరోపించిన జైట్లీ, పెట్రోల్, డీజెల్ పై ఒక్క రూపాయి వ్యాట్ తగ్గించినా, కేంద్రంపై రూ. 13 వేల కోట్ల భారం పడుతుందని, సంక్షేమానికి నిధులు తగ్గుతాయని అన్నారు.