నితిన్ ప్లాప్ సినిమాకి 50 మిలియన్ల వ్యూస్!
- నితిన్ హీరోగా వచ్చిన 'లై'
- తెలుగులో భారీ ప్లాప్
- హిందీలోకి అనువాదం
నితిన్ తో పాటు ఆయన అభిమానులను ఈ సినిమా నిరుత్సాహపరచడమే కాకుండా, భారీస్థాయిలో నష్టాలను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమా హిందీలోకి డబ్ చేయబడింది. హిందీ డబ్ మూవీకి యూట్యూబ్ లో 50 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. తెలుగులో అంతగా ఆదరణ పొందని ఈ సినిమా యూట్యూబ్ లో ఈ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుని అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ 'శ్రీనివాస కల్యాణం' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.