'జంబ లకిడి పంబ' విడుదల తేదీ ఖరారు
- శ్రీనివాస రెడ్డి హీరోగా 'జంబ లకిడి పంబ'
- కథానాయికగా సిద్ధి ఇద్నాని
- ఈ నెల 22వ తేదీన భారీ విడుదల
మురళీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి .. సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలను పోషించారు. పోసాని కృష్ణ మురళి .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీని తెలియపరుస్తూ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రం హీరోగా శ్రీనివాసరెడ్డికి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఇక 'జంబ లకిడి పంబ' హిట్ కొడితే, మరిన్ని హాస్యరసభరిత చిత్రాల్లో హీరోగా ఆయన బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.