అఖిల్ తో సినిమా వర్మ చేజారినట్టే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిల్ తో సినిమా వర్మ చేజారినట్టే!

  • అఖిల్ తో మూవీ ఉంటుందన్న వర్మ 
  • 'ఆఫీసర్' ప్లాప్ తో ఆలోచనలో పడిన ఫ్యాన్స్ 
  • వేరే ప్రాజెక్టు గురించి ఆలోచించడం లేదన్న అఖిల్
నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ 'ఆఫీసర్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే తన తదుపరి సినిమా అఖిల్ తో ఉంటుందని వర్మ చెప్పాడు. అసలే సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అఖిల్ .. వర్మతో సినిమా చేయనుండటం ఎంతవరకూ కరెక్ట్ అనే విషయంపై అందరూ మాట్లాడుకున్నారు. నాగార్జున .. అఖిల్ మాత్రం ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే తన నెక్స్ట్ మూవీ అఖిల్ తో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని వర్మ మరోమారు క్లారిటీ ఇచ్చాడు.

ఈ క్రమంలో 'ఆఫీసర్' సినిమా విడుదల కావడం .. ప్లాప్ టాక్ తెచ్చుకోవడం జరిగిపోయాయి. దాంతో వర్మతో అఖిల్ మూవీ ఉంటుందా .. లేదా అనే సందేహంలో అభిమానులు వున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ మాట్లాడుతూ .. "వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాను .. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ సినిమాపైనే వుంది. వేరే ఏ ప్రాజెక్టును గురించి నేను ఆలోచించడం లేదు .. అభిమానులకు నచ్చే సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే నా ముందున్న లక్ష్యం" అంటూ చెప్పుకొచ్చాడు. అఖిల్ ధోరణి చూస్తుంటే ఆయన వర్మ సినిమా చేయడం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పాడనిపించడం లేదూ!
akhil
venky atluri

More Telugu News